ETV Bharat / city

'అంతే లేకుండా దోపిడీ.. అడ్డే లేకుండా అప్పు.. ఇదీ జగన్ పాలన' - జగన్​పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు

అంతే లేకుండా దోపిడీలు చేయడం, అడ్డే లేకుండా అప్పులు తీసుకురావడం ఇదే వైకాపా ప్రభుత్వ పాలన అని తెదేపా నేత బుచ్చయ్య చౌదరి విమర్శించారు. కొత్త ఇసుక విధానంతో మరో భారీ దోపిడీకి తెరతీశారని ఆరోపించారు.

gorantla buchhaiah chowdary
గోరంట్ల బుచ్చయ్య చౌదరి
author img

By

Published : Nov 13, 2020, 12:46 PM IST

క్విడ్ ప్రో కో కంటే పెద్దమొత్తంలో ఇసుక విధానం ద్వారా దోపిడీకి తెరలేపారని తెదేపా శాసనసభా పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సీఎం జగన్ కనుసన్నల్లోనే మైనింగ్ మాఫియా రాష్ట్రాన్ని ఏలుతోందని ధ్వజమెత్తారు. రేవుల్లో నేరుగా తీసుకునే టన్ను ఇసుక ధర 50 రూపాయల నుంచి 375 రూపాయలు చేసిన వైకాపా ప్రభుత్వం తాజాగా దానిని 525 రూపాయలకు పెంచిందని మండిపడ్డారు. కొత్త ఇసుక విధానం చేపట్టే సంస్థ దోచుకునేందుకు అన్నివిధాలా అనుకూల వాతావరణం కల్పించారని.. సొంతవారికి ఇసుకను కట్టపెట్టి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్​కు తరలించేందుకే నూతన విధానం తయారైందని ఆరోపించారు. ఇంతగా ధర పెరిగిన ఇసుకపై 17 నెలల్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కమిటీల మీద కమిటీలు వేసి ఇదిగో అదిగో ఉంటూ జగన్ అండ్ కో ఇసుకలో వేల కోట్లు దోచుకుందని బుచ్చయ్య చౌదరి ఆక్షేపించారు. వరదలు తగ్గాక భారీగా ఇసుక అందుబాటులో ఉన్నా సామాన్యుడికి అందని పరిస్థితి ఉందని.. ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు లేక ఏడాదిన్నరగా నిర్మాణ రంగం కుదేలయిందన్నారు. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక అల్లాడుతుంటే, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని పక్కదారి పట్టించి వారికీ అన్యాయం చేశారని విమర్శించారు. అంతే లేదన్నట్లు అన్ని రంగాల్లో దోపిడీ చేయటంతో పాటు లక్షకోట్లకు పైగా అప్పు తెచ్చి మరీ వ్యవస్థల్ని నాశనం చేశారని దుయ్యబట్టారు.

టన్ను రూ. 50లు ఉండే ఇసుకను రూ. 525లు చేశారు. ఇంతగా ధర పెరిగిన ఇసుకపై ఎంత ఆదాయం వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏడాదిన్నరగా నిర్మాణాలు లేక నిర్మాణ రంగం కుదేలయింది. భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక అల్లాడిపోతున్నారు. అంతే లేదన్నట్లు వైకాపా ప్రభుత్వం దోపిడీలు చేస్తోంది. -- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా నేత

ఇవీ చదవండి..

దానం చేయండి.. అంటూ వస్తారు.. అందినవి దోచేస్తారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.