ETV Bharat / city

DEVINENI UMA: 'తెదేపాపై కక్షతోనే ఐకాన్ బ్రిడ్జి కూల్చివేత పనులు'

author img

By

Published : Jul 18, 2021, 7:25 PM IST

ముఖ్యమంత్రి జగన్(CM jagan) వైఖరిపై తెదేపా నేత దేవినేని ఉమ(TDP leader devineni uma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను బోర్డు పరం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఐకాన్‌ బ్రిడ్జి(icon bridge) ప్రారంభ నిర్మాణాలు కూల్చివేత పనులను(destroying works) ఆయన పరిశీలించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని మండిపడ్డారు.

తెదేపా నేత దేవినేని ఉమ
తెదేపా నేత దేవినేని ఉమ

తెదేపా నేత దేవినేని ఉమ

ఒక్క ఛాన్స్ అంటూ.. పదవిలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌... రాయలసీమ, పులిచింతల ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఆస్తులను కాపాడుకునేందుకు కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న 107 ప్రాజెక్టులను బోర్డుపరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరి ఉంటే, నేడు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన చెందారు.

న్యాయం చేయండి...

పోలవరం ప్రాజెక్టుకు పునాదులే లేవని గతంలో విమర్శించిన జగన్‌.. ప్రస్తుతం దాదాపు 100 టీఎంసీల గోదావరి జలాలు ఎలా నిల్వ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంపుప్రాంత వాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కోట్ల రూపాయల ప్రజాధనం వృథా...

రాష్ట్రంలో కూల్చివేతలు, విధ్వంసం తప్ప.. అభివృద్ధి జాడలే లేవని దేవినేని ఉమ విమర్శించారు. అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఐకాన్‌ బ్రిడ్జి ప్రారంభ నిర్మాణాలు కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని మండిపడ్డారు. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణాన్ని నిలిపివేయడం వల్ల విలువైన కృష్ణా జలాలు సముద్రం పాలయ్యాయన్నారు.

ఇదీచదవండి.

Araku tour: అరకు టూర్‌ ప్లాన్‌ చేశారా..? అయితే ఇది మీ కోసమే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.