Devineni Uma: పోలవరం నిర్మాణంలో ప్రణాళిక లేకుండా వైకాపా ప్రభుత్వం వ్యవహరించడం, నిధులు కేటాయించకపోవడం, రివర్స్ టెండరింగ్ పేరుతో నడిపిన డ్రామా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా లెక్క చేయకుండా ఏజెన్సీని మార్చడమే ప్రాజెక్టుకు శాపంగా మారాయని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘పోలవరం జాతీయ ప్రాజెక్టు. 50 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా రూపకల్పన చేశారు. 50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని తట్టుకునేలా స్పిల్‌వే నిర్మాణం తెదేపా హయాంలో జరిగింది. వైకాపా ప్రభుత్వ ప్రణాళిక లోపం, నిర్మాణ సంస్థను అర్ధంతరంగా మార్చేయడం వల్లే సరిదిద్దుకోలేని తప్పు జరిగిందని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. నిధుల కొరత, దిగువ కాఫర్‌డ్యాం మీద అలసత్వం వహించడంతోనే అక్కడ వరదనీరు చేరిందని నివేదికలో వెల్లడించింది’ అని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: