ETV Bharat / city

drugs issue: డ్రగ్స్ దందాలో విజయసాయి రెడ్డి ప్రమేయం: బుద్ధా వెంకన్న - డ్రగ్స్ వ్యవహారంపై బుద్దా వెంకన్న వ్యాఖ్యలు

డ్రగ్స్ వ్యవహారంతో( drugs issue) వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధముందని తెదేపా నేత బుద్ధా వెంకన్న( tdp leader budda venkanna) ఆరోపించారు. అందుకే ఆయన సొంత పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేరని చెప్పారు.

tdp leader budda venkanna on drugs issue

author img

By

Published : Oct 3, 2021, 1:37 PM IST

డ్రగ్స్ దందాలో విజయసారెడ్డి ప్రమేయముందని తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. మాదకద్రవ్యాలతో సంబంధంలేకపోతే విజయసాయి వైకాపాకి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నాడని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయన్న ఆయన.. వారికి తెలిసే పోర్టుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని దుయ్యబట్టారు. పోలీసులు విజయసాయిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే డ్రగ్స్ వ్యవహారం తాలూకా గుట్టు బయటపడుతుందన్నారు. డ్రగ్స్ దందా సహా, ఇసుక, మద్యం, భూఆక్రమణల్లో విజయసాయిరెడ్డి కీలకంగా ఉన్నాడని ఆరోపించాడు. తెదేపా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విజయసాయి అక్రమాలను బయటపెడుతుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: corruption in NREGA Works: ఉపాధి హామీ పనుల్లో అవినీతి... రూ.1.42 కోట్లు పక్కదారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.