ETV Bharat / city

budda venkanna: పోలీసు వ్యవస్థను కించపరిచేలా.. డీఐజీ త్రివిక్రమ్ వర్మ తీరు: బుద్ధా వెంకన్న - budda venakka fire on guntur dig thrivikravarma

గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ వ్యాఖ్యలు.. మొత్తం పోలీసు వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని తెదేపా నేత బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. జోగి రమేశ్ విషయంలో తప్పుడు ప్రకటనలు ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

tdp leader budda venkanna comments on guntur dig
తెదెేపా నేత బుద్ద వెంకన్న
author img

By

Published : Sep 21, 2021, 1:21 PM IST

గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ ( budda venkanna comments on guntur dig).. ఎమ్మెల్యే జోగి రమేశ్ సత్యశీలుడని క్లీన్ చిట్ ఇవ్వడమేంటని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న (budda venkanna) ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేశ్ దాడికి(attack on chandra babu house) రాలేదంటూ డీఐజీ త్రివిక్రమ్ వర్మ.. సినిమా కథను బాగా అల్లారని వెంకన్న విమర్శించారు. ఖాకీ యూనిఫాం వేసుకొని ఉన్నత పోస్టుకు ఆశపడి నీచమైన అబద్ధాలు చెప్పే త్రివిక్రమ్ వర్మ లాంటి వారివల్లే పోలీసులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. ఎంతో మంది నిజాయతీ పోలీసు అధికారులున్నా ఓ డీఐజీ స్థాయి వ్యక్తి వ్యవస్థ మొత్తాన్ని కించపరిచారని ఆక్షేపించారు.

చంద్రబాబుతో మాట్లాడటానికి జోగి రమేశ్​కు ఉన్న అర్హత ఏంటని వెంకన్న ప్రశ్నించారు. డీఐజీని కలవాలంటేనే అపాయింట్​మెంట్​ తీసుకోవాల్సి ఉంటుంది.... జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబును కలిసేందుకు అపాయింట్​మెంట్​ అవసరం లేదా అని డీఐజీని నిలదీశారు. తప్పు చేసే పోలీసులను న్యాయస్థానం బోనులో నిలబెడతామని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటన ఇచ్చినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.

సంబంధిత కథనం..

ఈనెల 17న కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై ఎస్పీలు విశాల్ గున్నీ, ఆరిఫ్ హఫీజ్​తో కలిసి డీఐజీ త్రివిక్రమ్ వర్మ వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికే ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆయన ఇంటికి వెళ్లారని..దాడి చేయటానికి కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదన్న డీఐజీ..అయినప్పటికీ కరకట్ట మొదటి భద్రత అంచె వద్దే అడ్డుకున్నామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి ఘటనంటూ బయట జరిగిన ప్రచారం అవాస్తవమన్నారు. పూర్తి నిరాధారంగా మీడియాలో కథనాలను ప్రసారం చేశారని డీఐజీ ఆరోపించారు.

జోగి రమేశ్ వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్లారు, దాడికి కాదు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు సమాచారం లేదు. సమాచారం లేకున్నా జోగి రమేశ్‌ను ముందే అడ్డుకున్నాం. మాజీ సీఎం ఇంటిపై దాడి ఘటన పేరుతో ప్రచారం అవాస్తవం. ముందుగా జోగి రమేశ్ కారుపైనే దాడి జరిగింది. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టేందుకు కొందరు యత్నించారు. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ కారు అద్దాలను రాయితో పగలగొట్టారు. డీజీపీ ఆఫీసులో లేరని తెలిసి 70 మంది హడావిడి సృష్టించారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిపక్ష నేతలు వచ్చే విధానమిది కాదు. ఇరుపక్షాల ఫిర్యాదులపై సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాం. -తివ్రిక్రమ్ వర్మ, డీఐజీ

ఇదీ చదవండి: CBN : 'ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.