ETV Bharat / city

'వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత దిల్లీ పెద్దలదే'

TDP Leader Bonda Uma on YS Viveka Murder Case: వైఎస్​ వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్​ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేస్తుందని తెదేపా నేత బోండా ఉమా ఆరోపించారు. వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దిల్లీ పెద్దలదేనని వ్యాఖ్యానించారు.

tdp leader bonda uma
tdp leader bonda uma
author img

By

Published : Feb 23, 2022, 6:28 PM IST

Uma on YS Viveka Murder Case: వైఎస్​ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దిల్లీ పెద్దలదేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. వివేకా కేసులో నిందితులను కాపాడేందుకు వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేస్తుందని ఆయన మండిపడ్డారు. వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల ఫోన్ నెంబర్లు.. రాష్ట్ర పోలీసుల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేరుతున్నాయని ఆరోపించారు. గతంలో.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు కర్ణాటకలో విచారణ జరిగినట్లు వివేకా హత్య కేసు విచారణ కూడా వేరే రాష్ట్రంలో జరపాలని బొండా డిమాండ్ చేశారు.

బాబాయ్ హత్యకేసు వెలికితీస్తున్న సీబీఐ అధికారులపై కేసు పెట్టించిన జగన్ రెడ్డి.. చరిత్రకెక్కారని బొండా దుయ్యబట్టారు. జగన్ ఆడుతున్న జగన్నాటకంలో భాగంగా అవినాష్ రెడ్డిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని అన్నారు. తాడేపల్లి ఆదేశాలు సీబీఐ పాటించట్లేదని ఏకంగా వారిపైనే కక్షకట్టారని బొండా ఉమా విమర్శించారు. ఎఫ్ఐఆర్ నమోదైన సీబీఐ అధికారి రాంసింగ్​ను హత్య చేసినా ఆశ్చర్యం లేదన్నట్లుగా రాష్ట్రలో పరిస్థితులు ఉన్నాయన్నారు.

సీబీఐపై కేసు పెట్టిన ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు విచారించాలో వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్​లో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. అప్రూవర్​గా మారిన దస్తగిరి హత్యకు పెద్దఎత్తున కుట్రలు జరుగుతున్నాయని బొండా ఆరోపించారు.

ఇదీ చదవండి: తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌ పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.