అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత భాజపాదేనని అయ్యన్నపాత్రుడు అన్నారు. అమరావతి అంశంలో ద్వంద్వ వైఖరి సరికాదని హితవు పలికారు. ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే మంత్రులు ప్రాధాన్యం ఇస్తున్నారని అయ్యన్న విమర్శించారు. అమరావతి తరలింపు కూడా రాజకీయ కుట్రలో భాగమేనని.. అమరావతి రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు చెప్పి వైకాపా మాట మార్చిందని విమర్శించారు. విషజ్వరాలపై మంత్రులు, కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు స్పందించట్లేదని అయ్యన్న పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఘటనపై కమిటీ వేశాం.. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం'