రాష్ట్రంలో ట్యాక్స్‌ల దందా నడుస్తోందని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో జే(J)ట్యాక్స్, జిల్లాలో మంత్రి (M) ట్యాక్స్, నియోజకవర్గంలో (M)ఎమ్మెల్యే ట్యాక్స్ పేరిట..జేఎమ్ఎమ్ (JMM) ట్యాక్సుల దందా సాగుతోందన్నారు. ఏ పని ప్రారంభించాలన్నా కొబ్బరికాయ కొట్టే ముందే జే-ట్యాక్స్ కట్టాల్సి వస్తోందనడానికి.. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపే నిదర్శనమన్నారు. రాయదుర్గంలో కాంట్రాక్టర్‌ను జయరామిరెడ్డి బెదిరించడాన్ని అచ్చెన్న ఖండించారు. వైకాపా నేతల తీరుతో.. రాష్ట్రంలో పనులు చేసేందుకు ఏ కాంట్రాక్టరూ ముందుకు రావడం లేదన్నారు. గడిచిన రెండేళ్లలో ఎంతో మంది కాంట్రాక్టర్లను బెదిరించి తరిమేశారని, రోడ్లు వేయడం మర్చిపోవడంతో వాహనాల చక్రాలు కూడా ఊడిపోతున్నాయని విమర్శించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా.. అభివృద్ధి పనులు సాగనివ్వకుంటే రహదారుల గోతుల్లో మిమ్మల్ని, మీపార్టీని తొక్కేస్తారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: