ETV Bharat / city

Atchennaidu: అంకెల గారడీతో మోసం.. సీఎం క్షమాపణ చెప్పాలి: అచ్చెన్నాయుడు - ముఖ్యమంత్రిపై తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం

అంకెల గారడీతో సీఎం జగన్ రైతులను మోసం చేశారని.. తెదేపా నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. అందుకు గాను వారికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు లోగిళ్లలో చీకటి కాంతులు నింపిన జగన్ రెడ్డి.. తప్పడు ప్రకటనలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా పేరుతో రూ.30కోట్లు మాత్రమే విడుదల చేసి, రూ.1,213కోట్లు ఇచ్చినట్లుగా రైతుల్ని మోసగించారన్నారు.

tdp leader atchennaidu fires on cm jagan over release of rythu bharosa funds
అంకెల గారడీతో రైతులను మోసం చేశారు.. సీఎం క్షమాపణ చెప్పాలి: అచ్చెన్నాయుడు
author img

By

Published : Oct 27, 2021, 2:07 PM IST

రైతు లోగిళ్లలో చీకటి కాంతులు నింపిన జగన్ రెడ్డి(cm jagan).. తప్పుడు ప్రకటనలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(tdp leader atchennaidu) ధ్వజమెత్తారు. రైతు భరోసా(rythu bharosa) కింద సోమవారం ఎంత మొత్తం నిధులు విడుదల చేశారో ముఖ్యమంత్రి చెప్పగలరా అని నిలదీశారు. రైతు భరోసా పేరుతో రూ.30కోట్లు మాత్రమే విడుదల చేసి, రూ.1,213కోట్లు ఇచ్చినట్లుగా రైతుల్ని మోసగించారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన రూ.18,777కోట్లలో 60శాతం కేంద్రం ఇచ్చిన నిధులు ఉంటే, మొత్తం తామే చెల్లించినట్లు అసత్యాలు చెప్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అంకెల గారడీతో మోసగించినందుకు.. వారికి సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని.. పంట విరామాలు ప్రకటిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చే తప్పుడు ప్రకటనలతో ప్రజల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు.

64.06 లక్షల మందికి ఇవ్వాల్సిన రైతు భరోసాను.. 45లక్షల మందికే పరిమితం చేశారని మండిపడ్డారు. 15.36 లక్షల మంది కౌలు రైతుల్ని 41వేలకు కుదించారన్నారు. సీఎం జగన్.. రైతు వ్యతిరేక విధానాల కారణంగా.. రెండన్నరేళ్లలో సుమారు 1500 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. బాధిత కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. సున్నా వడ్డీని.. రూ.లక్షలోపు రుణం తీసుకున్న వారికే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను.. రైతులకు దూరం చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

ఇదీ చదవండి:

Bramham: తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మంపై మరో కేసు నమోదు.. ఈ సారి ఏంటంటే?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.