Pattabhi Ram On Jagananna Amma Vodi : జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమ్మ ఒడి’ పథకం నాన్న బుడ్డికే సరిపోతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ ఇస్తామని జగన్ చెప్పినట్లు గుర్తు చేశారు. అమ్మఒడికి రూ.12వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. అందులో సగం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. సీఎం జగన్.. పిల్లలకు మేనమామ కాదు.. కంస మామ మాత్రమేనని పట్టాభి వ్యాఖ్యానించారు.
2021లో అసలు అమ్మఒడి ఇవ్వలేదని.. ఇప్పుడు ఇచ్చినా అందులో సగం కోత పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుంటే 2లక్షల మంది పదో తరగతి పిల్లలు ఎలా ఫెయిల్ అయ్యారని ప్రశ్నించారు. నాడు-నేడు కార్యక్రమం పేరుతో రూ.వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బైజుస్ టాబ్స్లో రూ. 500 కోట్ల దోపిడీ జరగనుందని పట్టాభిరామ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: