వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక చర్యలను కప్పిపుచ్చుకునేందుకే ఆలయాల నిర్మాణం పేరుతో సీఎం జగన్ మరో జగన్నాటకానికి తెరతీశారని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. సీఎం అయిష్టంగా విజయవాడలో ఆలయాలకు శంకుస్థాపన చేశారని విమర్శించారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన దుండగులను పట్టుకోవాలని బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థానికి భక్తులు రాకుండా సెక్షన్ 30అమలు చేయటం దారుణమని తెదేపా ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాచార్యులు, గురువులు, స్వామీజీలు, పెద్దలందరినీ రామతీర్థానికి రప్పించి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ చేశారు. భక్తుల దర్శనానికి మార్గం సుగమం చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అధికార పార్టీనేతలకు అన్ని అనుమతులిస్తూ.. ప్రతిపక్షాలు, భక్తులు రాకుండా ఆంక్షలు విధంచటం వెనుక ఆంతర్యం ఏమిటని ఆనంద సూర్య ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన