ETV Bharat / city

అన్నీ అయిపోయాయి... ఇక రేషన్ వంతా..?: అనిత - విజయవాడ వార్తలు

వైకాపా ప్రభుత్వంపై తెలుగు మహిళ రాష్ట్రాధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. రేషన్ సరకుల్లోనూ అవినీతికి ప్లాన్ చేశారని అనిత ఆరోపించారు

tdp anitha critised ycp govt
తెలుగు మహిళ రాష్ట్రాధ్యక్షురాలు వంగలపూడి అనిత
author img

By

Published : Jun 28, 2020, 11:18 AM IST

రేషన్ సరకుల్లోనూ పేదలను దోచుకునేందుకు వైకాపా ప్రభుత్వం ప్లాన్ చేసిందని తెలుగు మహిళ రాష్ట్రాధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. రంగుల పేరుతో దుబారా సొమ్మును పేదల నుంచి రికవరీ చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక వైకాపా ప్రభుత్వం 19 లక్షల రేషన్ కార్డుల్ని తొలగించిందని మండిపడ్డారు. తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే సరకుల ధరల పెంపు దుర్మార్గమని దుయ్యబట్టారు.

రేషన్ షాపుల్లో ప్రజలు సరకులు కొనలేరు కానీ దళారులు, జగన్ లాంటి దోపిడీదారులు జేబులు నింపుకుంటున్నారని అనిత విమర్శించారు. ధరల స్థిరీకరణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఏమైందని అనిత నిలదీశారు. బియ్యం సంచుల కోసం 750 కోట్ల రూపాయలు, రంగుల కోసం చేసిన 3వేల కోట్లు రూపాయలు దుబారా కాదా అని ప్రశ్నించారు. ఈ దుబారాలు అన్నీ తగ్గించుకుంటే ధరలు పెంచే అవసరం వచ్చేది కాదన్నారు.

నిన్నటి వరకు ఇసుక, సిమెంటు, మద్యం ధరలు పెంచి దోచుకున్నారని... ఇప్పుడు పేదల రేషన్​ను దోచుకోవడానికి సిగ్గుపడాలని అనిత ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం ఏ విషయంలో ప్రజల్ని ఆదుకుందో రోజారెడ్డి చెప్పాలని సవాల్‌ విసిరారు. కరోనా సమయంలో పెట్రోల్, డీజిల్, రేషన్ సరకుల ధరలు పెంచడం ఆదుకోవడమా అని ప్రశ్నించారు. కరోనా కిట్లలలోనూ కుంభకోణానికి పాల్పడడం ఆదర్శమా అని దుయ్యబట్టారు. ఏడాదిలో రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాలేదని... ఇంకా అప్పుల గురించి మాట్లాడడానికి రోజా సిగ్గుపడాలన్నారు.

ఇవీ చదవండి:కాపులకు ఆర్థిక సాయం విషయంపై కమిటీని నియమించిన తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.