ETV Bharat / city

police suspended: గోవాలో చెల్లికి ఫేక్ పెళ్లంట.. హైద్రాబాద్ లో అన్నయ్యకు రియల్ సస్పెన్షనంట! - తెలంగాణ వార్తలు

చెల్లి పెళ్లి ఉందని చెప్పి సెలువులు తీసుకున్నాడో కానిస్టేబుల్.. దర్జాగా గోవా చెక్కేశాడు.. పోలీస్ చొక్కా తీసేశాడు.. తనలోని రెండో యాంగిల్ ను బయటపెట్టాడు. తెలిసినవాళ్లెవ్వరూ చూసే ఛాన్సే లేదనుకున్నాడు. కానీ.. హైద్రాబాద్ పోలీసులు చూసేశారుగా..

Suspension on the constable who conducted the betting
చెల్లి పెళ్లి.. గోవాలో క్రికెట్ బెట్టింగ్.. కానిస్టేబుల్ సస్పెన్షన్
author img

By

Published : Oct 30, 2021, 5:15 PM IST

చెల్లెలు పెళ్లి ఉందని చెప్పి గోవాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డ ఓ టాస్క్​ఫోర్స్ కానిస్టేబుల్​ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్(police suspended) చేశారు. టాస్క్​ఫోర్స్​లో పనిచేసే కానిస్టేబుల్ ఇమ్రాన్.. తన చెల్లెలు పెళ్లి ఉందని చెప్పి పదిహేను రోజుల క్రితం గోవాకు వెళ్లినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఐపీఎల్​తో పాటు ప్రస్తుత టీ-20 బెట్టింగ్​లకు పాల్పడినట్లు వెల్లడించారు. భారత్-పాక్ మ్యాచ్(Bharat-Pak match 20210 సందర్భంగా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తుండగా... గోవా పోలీసులు దాడి చేసి పట్టుకున్న వారిలో ఇమ్రాన్ సైతం ఉన్నట్లు వివరించారు.

గోవా పోలీసులు తొలుత తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్ ఎస్​వోటీ పోలీసులకు సమాచారం అందించారు. గోవా పోలీసుల సమాచారంతో నగర పోలీసు అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ చిక్కినట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నట్లు వెల్లడించారు. ఇమ్రాన్​ను మూడు రోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్(police suspended) చేశారు. పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా స్థానిక టాస్క్​ఫోర్స్ పోలీసులు సైతం ఇమ్రాన్ గత వ్యవహారశైలిపై దృష్టి పెట్టారు. ఇక్కడ ఆయనతో పాటు మరెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి:
POLLING: హుజూరాబాద్ లో జోరుగా పోలింగ్.. మధ్యాహ్నం 3 వరకు 61.66 శాతం ఓటింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.