ETV Bharat / city

సుజనా ఫౌండేషన్ దాతృత్వం: 100 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ - సుజనా ఫౌండేషన్ తాాజా వార్తలు

కొవిడ్ విజృంభిస్తోన్న వేళ సుజనా ఫౌండేషన్ దాతృత్వాన్ని చాటుకుంది. 100 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్​ను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. కొవిడ్ కేంద్రం ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ ఫౌండేషన్ సీఈవో ఏకే రావు.. కలెక్టర్ ఇంతియాజ్​కు లేఖ రాశారు.

sujana foudation
sujana foudation
author img

By

Published : Apr 30, 2021, 8:46 PM IST

రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్నవారిని ఆదుకునేందుకు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ ముందుకొచ్చింది. విజయవాడలోని తమ వెన్యూ కన్వెన్షన్ సెంటర్​లో వందపడకల ఆసుపత్రి నెలకొల్పేందుకు నిర్ణయించింది. అనుమతులివ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్​కు ఫౌండేషన్ సీఈవో ఏకే రావు లేఖ రాశారు. ప్రభుత్వ నిబంధనలతో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రోగులకు అవసరమైన మందులు, ఆహారాన్ని ఫౌండేషన్ సమకూరుస్తుందని తెలిపారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయలతో మందులు, ఆహారపంపిణీ, సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

ఇదీ చదవండి: 24 గంటల కొవిడ్ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం: ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.