ETV Bharat / city

పుత్రక్షోభ.. మార్చింది సేవామూర్తిగా - sudeekshan foundation story

ఎదిగొచ్చిన కొడుకు ప్రమాదంలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు... పుత్రక్షోభ ఆమెను కుంగదీయలేదు. ఆమె కొడుకు పరిస్థితి వేరే వారికి రాకూడదనుకుంది. రోడ్డు ప్రమాదాలపై యువతకు అవగాహన కల్పించింది. ప్రమాదాల్లో అవయవాల్ని కోల్పోయిన పేదలకు కృత్రిమ అవయవాలు సాయం చేసిన విమలపై కథనం.

sudeekshan foundation story
సుదీక్షణ్‌ ఫౌండేషన్‌ పై కథనం
author img

By

Published : Apr 12, 2020, 3:18 PM IST

sudeekshan foundation story
సుదీక్షణ్‌ ఫౌండేషన్‌ పై కథనం

విజయవాడకు చెందిన చిగురుపాటి విమలది సాధారణ కుటుంబం. ఆమెకు ఇద్దరు పిల్లలు. రోజూ మాదిరిగానే కాలేజీకి వెళ్లిన తన ఇరవై ఏళ్ల కొడుకు సుదీక్షణ్‌ 2006లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన కొడుకులాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదని, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు విమల. దీని కోసం 2007లో ‘సుదీక్షణ్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేశారు. అప్పటినుంచీ ఈ ఫౌండేషన్‌ ద్వారా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూనే ప్రమాదాల్లో అవయవాల్ని కోల్పోయిన పేదలకు కృత్రిమ అవయవాల్ని అమర్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు ఐదు వేల మందికి కృత్రిమ అవయవాల్ని అమర్చారు. వీటిని అమర్చడానికి రూ.6 కోట్ల వరకు ఖర్చు చేశారు.

అదేవిధంగా పుట్టుకతో వైకల్యమున్న వారికీ, వెన్నెముక సమస్యతో నడవలేని వారికీ రూ.30 లక్షల విలువైన 600 ట్రైసైకిళ్లను అందించారు. విలువైన కృత్రిమ అవయవాల్ని అమర్చుకునే ఆర్థిక స్తోమత పేద దివ్యాంగులకు ఉండదనీ, దీన్ని దృష్టిలో ఉంచుకునే అమెరికాలో ఉంటున్న కూతురు శ్రీముఖి, అల్లుడు రంజిత్‌కుమార్‌, స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నానని అంటున్నారు విమల.

ఇదీ చదవండి: ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం జగన్​ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.