లాక్డౌన్ కారణంగా బ్రిటన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తనకు సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన సందేశాలకు వెంటనే స్పందించి విద్యార్థులు రాష్ట్రానికి రావటానికి చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లామని.. ప్రభుత్వం తరపున కృషి చేయాల్సిందిగా కోరినట్టు మంత్రి వివరించారు. లాక్ డౌన్ సమయం ముగిసే వరకు వారికి అన్ని వసతులు కల్పించి అనంతరం రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని బ్రిటన్లోని భారత హై కమిషనర్ రుచి ఘనశ్యాంతో ఫోన్లో మాట్లాడినట్టు తెలియచేశారు.
ఇదీ చూడండి: