ETV Bharat / city

AUDIMULAPU SURESH : మంత్రికి నిరసన సెగ...పరిస్థితి ఉద్రిక్తం - ఆదిమూలపు సురేశ్‌కు విద్యార్థి సంఘాల సెగ

విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్‌ అండ్‌ బీ భవనంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ నిర్వహిస్తున్న మీడియా సమావేశాన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. ఎయిడెడ్‌ సంస్థలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల నేతలు మంత్రితో వాగ్వాదానికి దిగారు.

మంత్రికి నిరసన సెగ
మంత్రికి నిరసన సెగ
author img

By

Published : Nov 9, 2021, 5:52 PM IST

Updated : Nov 10, 2021, 5:00 AM IST

మంత్రికి నిరసన సెగ

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల ఘటనపై మంత్రి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశాన్ని విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను కాపాడాలని, అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఒక్కసారిగా పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాల నేతలు విలేకర్ల సమావేశం వద్దకు దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి విలేకర్ల సమావేశాన్ని కొంత సమయం వాయిదా వేసి, వారితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రికి విద్యార్థి సంఘాల నేతల మధ్య వాగ్వాదం సాగింది. ఎయిడెడ్‌కు గ్రాంటు నిలిపివేస్తే యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తాయని, వాటిని విద్యార్థులు ఎలా చెల్లిస్తారని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. అనంతపురం పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్‌ సంస్థలను ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మంత్రి వారికి సమాధానమిస్తూ అనంతపురం కళాశాల యాజమాన్యం సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతి తెలిపిందని, ఎయిడెడ్‌ విషయంలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కళాశాలలు ప్రైవేటుగా మారినా ఉన్నత విద్య కమిషన్‌ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులతో మంత్రి చర్చిస్తున్న సమయంలోనే పోలీసులు వారిని చుట్టుముట్టారు. వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వం విద్యార్థులపై దాడులు చేయడం దుర్మార్గమని, ఎయిడెడ్‌ విద్యా సంస్థల కొనసాగింపుపై మంత్రి అవాస్తవాలు, వక్రీకరణలు చెబుతున్నారని విమర్శించారు.

విద్యార్థులను అరెస్టు చేసి వ్యానులోకి ఎక్కిస్తున్న పోలీసులు

తెదేపా రెచ్చగొడుతోంది : మంత్రి సురేష్‌
విద్యార్థులతో రాజకీయాలు చేయాలనుకుంటే ఖబడ్దార్‌ అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులను రెచ్చగొట్టి తెదేపా ఆందోళనలు చేయిస్తోందని ఆరోపించారు. తల్లిదండ్రుల ముసుగులో విశాఖపట్నం, కాకినాడల్లో ఆందోళనలు చేశారని విమర్శించారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.‘‘ఎయిడెడ్‌ పాఠశాలలంటే లోకేష్‌ నీకు తెలుసా? జాగ్రత్త పులిపై స్వారీ చేస్తున్నావు. పిల్లలతో రాజకీయాలు చేస్తావా?’’అని ప్రశ్నించారు. ‘‘తెదేపా అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిడెడ్‌ పోస్టులను భర్తీ చేయలేదు. ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎయిడెడ్‌ విషయంలో అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. అనంతపురం ఘటనను ప్రభుత్వం ఖండిస్తోంది. ఈ ఆందోళనలో విద్యార్థిని జయలక్ష్మీని దుండగులు రాయితో కొట్టారు. విద్యార్థుల సంఘాల ముసుగులో రాళ్లు, చెప్పులు విసిరారు. దీనిపై దర్యాప్తు చేయిస్తాం. ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో 90శాతం అన్‌ఎయిడెడ్‌ సెక్షన్లను నిర్వహిస్తున్నారు. 400 విద్యా సంస్థల్లో ఒక్క పిల్లవాడూ లేడు’’ అని తెలిపారు.

ఇదీచదవండి: RESULTS : ఫలితాలు విడుదల... ఉత్తీర్ణుల్లో మహిళలే అత్యధికం

Last Updated : Nov 10, 2021, 5:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.