పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్‌లో స్టేషన్ ఓపెన్ హౌస్‌ను నిర్వహించారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ మేరీ ప్రశాంతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో పోలీసులు వినియోగించే అన్ని రకాల ఆయుధాలను ప్రదర్శించారు. ఆపద సమయాల్లో ఆయుధాలను ఏ విధంగా వినియోగిస్తారో సందర్శకులకు తెలియజేశారు. బాంబులను నిర్వీర్యం చేసే పద్ధతిని బాంబు స్క్వాడ్ వివరించారు. మెటల్ డిటెక్టర్ ఏ విధంగా పనిచేస్తాయో తెలిపారు. డాగ్ స్వ్యాడ్ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి :