ETV Bharat / city

NTR Vardhanthi: స్వర్గీయ ఎన్టీఆర్​కు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళులు - tributes on NTR Vardhanthi

NTR vardhanthi: స్వర్గీయ ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్టీఆర్‌ సేవలను స్మరించుకున్నారు. నందమూరి బాలకృష్ణ సహా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో శ్రద్ధాంజలి ఘటించారు.

NTR Vardhanthi
ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి
author img

By

Published : Jan 18, 2022, 8:51 PM IST

ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి... రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళులు

Tributes to NTR: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామరావు వర్ధంతి సందర్భంగా... రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక... ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు తారక రాముడన్నారు. వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులర్పించారు. తనకు ఎదురైన ప్రతి సవాలునూ సంచలన విజయంగా మార్చుకున్న నిజమైన కథానాయకుడు ఎన్టీఆర్ అని నారా లోకేష్ అన్నారు. నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి.. ఇవే ఎన్టీఆర్ ఆయుధాలని కొనియాడారు.

NTR vardhanthi: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సినీనటుడు నందమూరి బాలకృష్ణ, లక్ష్మీపార్వతి, తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చరిత్ర మరువలేనిదని... ఆయన మాట తప్పని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని బాలకృష్ణ అన్నారు.

తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ ధ్రువతార మీరేనంటూ తాతను గుర్తుచేసుకుంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీఆర్‌తోనేనని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి అచ్చెన్న ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. చల్లపల్లిలోని ఎన్టీఆర్‌ పార్కులో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్​ జన్మస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో.. ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మచిలీపట్నంలో అన్నదానం చేపట్టగా... గన్నవరంలో చీరల పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో.. తెలుగుదేశం నేతలు.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్రలో ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. విజయనగరం కోట జంక్షన్‌లో అశోక్ గజపతి రాజు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గలో ఎన్టీఆర్‌ వర్ధంతి సభకు తెదేపా నేతలు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి, చేజర్లలో తెలుగుదేశం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో... తారకరామరావు విగ్రహానికి అభిమానులు శ్రద్ధాంజలి ఘటించారు. SPOT

రాయలసీమ జిల్లాల్లోనూ ఎన్టీఆర్‌ విగ్రహానికి అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. కడప జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్‌కు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు భారీ ర్యాలీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా పాణ్యం, నంద్యాల, కల్లూరులో ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

ఇదీ చదవండి..

తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ను మరచిపోలేరు: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.