విశాఖ జిల్లాలో..
ఆటోలో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని విశాఖ జిల్లా రోలుగుంట పోలీసుసు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు రూ.2లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఆటో సీజ్ చేసి.. నిందితుడి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని అటవీప్రాంతంలోని నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. సుద్దకురావ తాండ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేయడానికి ఉంచిన 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో..
ఆంధ్ర సరిహద్దుల్లోని ఒడిశా గ్రామాల్లో సారా తయారీ స్థావరాలపై అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కే.శ్రీనివాస రావు, అసిస్టెంట్ కమిషనర్ ఎస్. సుఖేష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. భారీగా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇచ్చాపురం పరిసర ప్రాంతం ఒడిశాలోని జరోధ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగాపూర్ రామచంద్రాపూర్ గ్రామాల్లో గల స్థావరాలపై రాష్ట్ర అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో గంగాపూర్ లో 20 వేల 600 లీటర్లు.. రామచంద్రపురంలో 6వేల లీటర్లు.. కొండజాపూర్ లో 4.800 లీటర్లు బెల్లం ఊట, 290 నాటుసారాను ధ్వంసం చేశారు.
కృష్ణా జిల్లాలో..
నందిగామ మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 95 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. నందిగామ సీఐ కనకారావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. నిందితుడు మార్క్ పొడి జోయా ఫుల్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లాలో..
రూ. 1.38 లక్షల విలువైన 7776 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను విడపనకల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనాలపై కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా.. వారందిరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. ఈ మద్యాన్ని కర్ణాటక ప్రాంతంలోని బళ్లారి జిల్లా రూపనుగూడి నుంచి తెచ్చినట్లు ఎస్ఐ గోపీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: