ETV Bharat / city

రక్తదానం: గిన్నిస్​ రికార్డ్​ సాధించిన విద్యార్థులు - రాష్ట్ర రెడ్​క్రాస్ సొసైటీకి గిన్నీస్ రికార్డు

రక్తదానం చేస్తామంటూ 8 గంటల్లో ఏకంగా 10వేలకు పైగా విద్యార్థులు ముందుకువచ్చారు. విజయవాడ లయోలా కళాశాలలో నిర్వహించిన రక్తదాన నమోదు కార్యక్రమంలో 10వేల 217 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుని గిన్నిస్​ రికార్డ్​ సాధించారు.

state Red cross society got Guinnis Record
రాష్ట్ర రెడ్​క్రాస్ సొసైటీకి గిన్నీస్ రికార్డు
author img

By

Published : Feb 16, 2020, 10:35 AM IST

రాష్ట్ర రెడ్​క్రాస్ సొసైటీకి గిన్నిస్ రికార్డు

సామూహిక రక్తదాతల అంగీకార నమోదులో విద్యార్థులు గిన్నిస్‌ రికార్డు సాధించారు. భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ డాక్టర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రారంభించారు. రక్తదాన అంగీకారానికి ముందుకొచ్చిన యువతను గవర్నర్‌ ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చేస్తామంటూ 8 గంటల్లో 10వేల 217 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిని రికార్డుగా గుర్తించి, రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్​ ప్రతినిధి రిషినాథ్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి.. చదువుల తల్లికి స్వర హారతి.. విజయవాడలో వైభవంగా కచ్ఛపీ మహోత్సవం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.