రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథారిటీ, పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేయకపోవటంపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిపింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి,హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, డీజీపీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతను మినహాయిస్తూ గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీవో 42 సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఇదీ చూడండి: