ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందో చెప్పాలని ప్రజలు అడుతున్న ప్రశ్నకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పి తీరాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలని బలంగా చెప్పి.. లాలూచీ రాజకీయాలు చేస్తూ.. ప్రజల నమ్మకాలను కొల్లగొట్టి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ఎంపీల బలమున్నా కేంద్రానికి అల్టిమేటం ఇచ్చి రాష్ట్ర హక్కులపై పోరాడట్లేదని ఆరోపించారు.
తమ రాష్ట్ర హక్కుల గురించి అడుగుతున్న జార్ఖండ్ ముఖ్యమంత్రిని అడ్డుకునే ప్రయత్నం జగన్ రెడ్డి చేయటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల భయం, పదవీ వ్యామోహంతో ఒక్క అంశంలోనూ కేంద్రాన్ని అడగలేని తీరుతో రాష్ట్రం మరింతగా నష్టపోతోందన్నారు. కేంద్రంపై పోరాడేలా యువత, ప్రజలు జగన్పై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. పోలీసు కస్టడీలో ఉన్న ఎంపీని చిత్రహింసలు పెట్టి దేశంలో ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: