ETV Bharat / city

గౌరవప్రదంగా ఆఖరి మజిలీ... వారి సంస్కారానికి సలాం!

కరోనా వైరస్‌తో మరణించిన వారి మృతదేహాలను చూసేందుకు కొన్నిచోట్ల కుటుంబ సభ్యులే ముందుకు రావడం లేదు. కొందరు మాత్రం ప్రభుత్వాసుపత్రుల మార్చురీ గదుల్లోని భౌతిక కాయాలను దూరంగా ఉండి చూసి వెళ్లిపోతున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం, వైరస్‌ తమకూ సోకుతుందోమోనన్న భయంతో ఇలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా మృతుల అంత్యక్రియలకు మేమున్నామంటూ ముందుకొచ్చి... అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహిస్తున్నారు పలువురు మానవతావాదులు.

corona funeral
corona funeral
author img

By

Published : Aug 2, 2020, 5:31 PM IST

అయినవాళ్లెందరున్నా... వారి చేత అంతిమ సంస్కారాలకు నోచుకోలేని దయనీయత!

బంధుగణమెంతున్నా ... కడచూపులూ దక్కని హృదయ విదారత!

కొన్నిచోట్ల అంత్యక్రియలకు వచ్చేందుకు అయినవాళ్ళే భయపడిపోతున్న దుర్భరత.

భౌతికకాయాన్ని అల్లంత దూరం నుంచే చూస్తూ... తమలో తాము కుమిలిపోతూ దుఃఖించటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత!

పలుచోట్ల అపోహలతో స్థానికుల నుంచి అడ్డగింత!..

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా మృతుల అంత్యక్రియలకు మేమున్నామంటూ ముందుకొచ్చి... ఆఖరు మజిలీని గౌరవప్రదంగా నిర్వహిస్తున్నారు పలువురు మానవతావాదులు! అపోహలు, భయాందోళనలను పక్కన పెట్టి, ప్రాణాలకు తెగించి మరీ ఈ మహత్కార్యాన్ని ముందుండి చేపడుతున్నారు. వారు నివసించే పట్టణాలు, జిల్లా, పరిసర ప్రాంతాల పరిధిలో కొవిడ్‌-19 బారిన పడి ఎవరు ప్రాణాలు కోల్పోయినా సరే అంతిమ సంస్కారాలు చేస్తూ స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు.

అంతిమం కోసం 'అన్నం'

తెలంగాణలోని ఖమ్మంకు చెందిన అన్నం శ్రీనివాసరావు కొవిడ్‌ కాలంలో చేస్తున్న సేవలు మాటల్లో చెప్పలేనివి. కరోనా బారిన పడి మృతి చెందిన దేహాలను కుటుంబ సభ్యులు వదలి వెళ్తుండటంతో ‘అన్నం ఫౌండేషన్‌’ ద్వారా మృతదేహాలకు ఆయనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ‘కరోనా’ బారినపడి ప్రాణాలొదిలిన వారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారు. వీరిలో 35 మృతదేహాలకు కుటుంబ సభ్యులు, బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో శ్రీనివాసరావు ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఏ మతానికి చెందిన వారైనా వారి ఆచారం ప్రకారం ఆఖరి మజిలీని పూర్తి చేస్తారు. ఇందుకు మహిళలు సహా పలువురు (రాము, చంటి, రవి, సురేశ్‌, రాజేశ్‌, సరస్వతి, ఈశ్వరమ్మ) ఆయనకు సాయం చేస్తున్నారు. అభ్యాగుల ఆకలి తీర్చడం, ఆశ్రయం కల్పించడంతోపాటు ఇప్పటి వరకు సుమారు 4,270 (కరోనా లేనికాలంలో) మృతదేహాలకు అన్నం ఫౌండేషన్‌ అంత్యక్రియలు నిర్వహించింది.

బతికినంత కాలం సమాజానికి సేవ చేయాలన్నదే నా తపన. తల్లిగర్భం నుంచి ఏమీ తెచ్చుకోలేదు. కులం, మతం, ఆస్తి ఏమీ తేలేదు. పోయేటప్పుడు నేనేమీ తీసుకుపోను. అందుకే సేవే మార్గంగా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. జీవితాంతం అనాథలతోనే జీవిస్తా.. వారి సేవలోనే తరిస్తా. కరోనానే కాదు అంతకుమించి వ్యాధి సోకి మృతిచెందిన వారి మృతదేహాలకు సైతం అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకాడను. నా మరణానంతరం నా నేత్రాలు, అవయవాలనూ దానం చేస్తున్నా.

- డాక్టర్‌ అన్నం శ్రీనివాసరావు

పదేళ్లుగా అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాల నిర్వహణ

అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కరోనాతో మృతి చెందితే మొదటి ఫోన్‌కాల్‌ ఫారూక్‌ఖాన్‌కే వస్తోంది. 9346943336 నెంబర్‌కు కాల్‌ చేస్తే తమ ఉచిత సేవ అందుబాటులో ఉంటుందని ఆయన ‘‘ఈనాడు’’కు తెలిపారు. గత పదేళ్లుగా అనేక అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్న ఉమర్‌ఫారూక్‌ ఖాన్‌ది అనంతపురం జిల్లా హిందూపురం. ఇప్పటివరకూ ఆయన తన మిత్రబృందంతో కలిసి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి అంతిమ సంస్కారాలు చేశారు.

కరోనా వ్యాధి సోకిందంటేనే మొదట్లో విపరీతంగా భయపడేవారు. ఎవరైనా మృతిచెందితే అంత్యక్రియలు చేయటానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. అప్పటికే వీటి నిర్వహణలో మాకు అనుభవం ఉండటంతో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, మృతుల బంధువులు మమ్మల్ని సంప్రదించేవారు. దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు పాటించి అంతిమ సంస్కారాలు నిర్వహించటం మొదలుపెట్టాం. కొవిడ్‌ రోగులు మరణించిన తర్వాత ఆ శరీరంలో ఎన్ని గంటల పాటు వైరస్‌ ఉంటుంది? మృతదేహాల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందుతుందా? తదితర అంశాలపై అంతర్జాలంలో శోధించి నిపుణుల అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత మరింత ధైర్యంతో కార్యక్రమాలు చేస్తున్నాం. మాకెలాంటి భయాందోళన లేదు. ఈ పనిలో ఎంతో సంతృప్తి లభిస్తుంది. ఒకసారి అంత్యక్రియలు చేసిన తర్వాత పూర్తిగా క్వారంటైన్‌కు వెళ్లిపోతున్నాం.

- ఫారూక్‌

కుంగుబాటు నుంచి...

కొవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లాలంటే కుటుంబ సభ్యులే వెనుకంజ వేస్తున్న పరిస్థితి. కానీ కాకినాడ యువకుడు అమజాల వీర వరప్రసాద్‌ మాత్రం ధైర్యంగా వారి వద్దకు వెళ్లి స్వచ్ఛందంగా ఉచిత సేవలందిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్‌లోని కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్న పలువురు రోగులకు వారి కుటుంబ సభ్యులు సిద్ధం చేసి ఇచ్చే ఆహారాన్ని తీసుకెళ్లి ఉదయం, సాయంత్రం అందిస్తున్నారు. అక్కడ వారికి అవసరమైన సేవలూ చేస్తున్నారు. కరోనాతోఎవరైనా మృతిచెందితే ఆ మృతదేహాల్ని వారి స్వగ్రామాలకు వాహనాల్లో తీసుకెళ్లటానికి లేదా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఆయన ‘‘ఈనాడు’’కు చెప్పారు. 7702945956, 9346592868 నంబర్లకు ఫోన్‌ చేసి చెబితే ఆ సేవలు ఉచితంగా అందిస్తానని ఆయన చెప్పారు.

గత కొన్నాళ్లుగా నేను ఓ తీవ్రమైన సమస్యతో బాధపడి కుంగుబాటుకు లోనై, ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకుందామనకున్నా. ఆ తర్వాత బాగా ఆలోచిస్తే నేను అలా చేసి కుటుంబ సభ్యుల్ని బాధపెట్టటం కంటే.. బతికి నా వల్ల సమాజానికి ఏమైనా మేలు చేయగలనా? అని ఆలోచించా. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు సేవ చేయాలని, వారి మృతదేహాలకు అంతిమసంస్కారాలు నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. వెంటనే అమలులో పెట్టా. నాకు లక్ష్య సేవా సంస్థ, అక్షర ఫౌండేషన్‌ నుంచి కూడా అవసరమైన సహకారం అందుతోంది.

- అమజాల వీర వరప్రసాద్‌

మిత్ర బృందంతో కలిసి...

కరోనా తీవ్రత ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ పలు మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు విజయవాడకు చెందిన ఫతావుల్లా ఆయన మిత్రబృందం. వీటిలో కొన్ని కొవిడ్‌తో మృతిచెందిన వారివి కాగా, మరికొన్ని ఇతర అనారోగ్యాలతో చనిపోయిన వారి మృతదేహాలు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ముస్లింలు కరోనాతో చనిపోతే వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు తమకు 8008141425 నంబర్‌కు కాల్‌ చేయొచ్చని ఆయన చెప్పారు.

రెడ్‌క్రాస్‌ సేవకులు

రెడ్‌క్రాస్‌ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ జగన్మోహన్‌ రావు ఇటీవల ఇచ్చిన పిలుపు స్పందించి- కరోనా మృతుల దహన సంస్కారం చేయడానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 18 మంది ముందుకు వచ్చారు. వీరితో ఒక బృందం ఏర్పాటు చేసి ఎవరైనా మృతి చెందితే సంబంధిత అధికారుల ఆదేశంపై ఈ సభ్యులు వెళ్లి ఆయా దేహాలను సురక్షితంగా తీసుకువెళ్లి శ్మశానవాటికలో అప్పగించి వస్తున్నారు.

ఇదీ చదవండి: మోదీ కోసం 'జై శ్రీరామ్'​ సందేశంతో ప్రత్యేక వస్త్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.