ఇంటింటికీ తాగునీరు అందాలనే తమ చిరకాల స్వప్నం తీరడం లేదని కృష్ణా జిల్లా కొండపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో కేంద్రప్రభుత్వం పుర ప్రాజెక్టును ప్రారంభించినా... పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఇంటింటికీ పైపులైన్, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. రూ. 18 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు స్థలాన్ని ఎంపిక చేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 13 కోట్ల నిధులు కేటాయించినా... పనుల్లో పురోగతి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రామ పంచాయతీగా ఉన్న కొండపల్లి ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. కొండపల్లిలో తాగునీటి పైపులైన్లు వేసేందుకు పుర నిధుల అనుమతి కోరుతూ... ఇటీవలే ప్రభుత్వానికి కలెక్టర్ ఇంతియాజ్ ప్రతిపాదనలు పంపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కొండపల్లి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: