కొవిడ్ బారి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవనిగడ్డలోని గ్రామదేవత శ్రీ లంకమ్మ అమ్మవారికి జనసేన నాయకులు 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. పవన్ కల్యాణ్‌కు కొవిడ్ పాజిటివ్ అనే వార్త కార్యకర్తలకు చాలా బాధ కలిగించిందని.. ఆయన త్వరగా కోలుకోని ప్రజల మధ్యకు రావాలని అమ్మవారిని కోరుకున్నట్లు నాయకులు తెలిపారు. ఈ పూజలో స్థానిక నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: