రాష్ట్రం నుంచి విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ పోస్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సాధారణ పరిపాలన శాఖలో విదేశీ వ్యవహారాల అంశాలపై పర్యవేక్షణ కోసం విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి ఎ.గీతేశ్ శర్మను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఏపీకి అంతర్జాతీయ సహకారం కోసం ఈ ప్రత్యేక పోస్టును ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ దేశాలకు చెందిన దౌత్యకార్యాలయాలతో సమన్వయం కోసం ఈ ప్రత్యేక అధికారి పని చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి