ETV Bharat / city

ఈటీవీ రజతోత్సవం... సోమిరెడ్డి, కళా వెంకట్రావు శుభాకాంక్షలు

రజతోత్సవం సందర్భంగా.. ఈటీవీకి తెదేపా నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో మంచి కార్యక్రమాలతో తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని అభినందించారు.

somireddy chandra mohan reddy kala venkatrao congratulate etv
ఈటీవీ రజతోత్సవం... సోమిరెడ్డి, కళా వెంకట్రావు శుభాకాంక్షలు
author img

By

Published : Aug 27, 2020, 5:25 PM IST

ఈటీవీ రజతోత్సవ వేళ.. సంస్థ యాజమాన్యానికి, ఉద్యోగులకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పాతికేళ్లుగా రోజూ రాత్రి 9 గంటలకు వచ్చే ఈటీవీ వార్తలు చూడకుండా తనకు ఏం తోచదని అన్నారు. రాత్రి సమయంలో కామెడీ, ఎంటర్​టైన్​మెంట్ కార్యక్రమాలతో మానసిక ఉల్లాసం కలిగించటంతో పాటు.. బ్యాలెన్సెడ్ న్యూస్ టెలికాస్ట్ ఛానల్​గా గుర్తింపు పొందడం అభినందనీయమని ప్రశంసించారు. ఇలాంటి టీవీని ప్రజల ముందుకు తెచ్చిన రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు ప్రజల మదిలో మెదిలే ఈటీవీ

పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈటీవీకి మాజీ మంత్రి కళావెంకట్రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల మదిలో ప్రతిక్షణం మెదిలేలా ఈటీవీ నాటుకుపోయిందన్న ఆయన... తెలుగు వారితో అవినాభావ సంబంధాన్ని ఏర్పరుచుకుని తెలుగు సాంప్రదాయానికి, సంస్కృతికి నిలువుటద్దంలా దేశ వ్యాప్తంగా మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. వేలాదిమందికి ఉపాధిని కల్పిస్తూ ఈటీవీ జర్నలిజం విలువలను కాపాడుతోందని తెలిపారు. అక్షర రూపాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ రైతులకు, యువతకు మార్గదర్శకాలను చూపిస్తోందన్నారు. ఈటీవీ ఎదుగుదలకు కృషి చేసిన సిబ్బందికి, యాజమాన్యానికి, ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

'రాజధాని కేసులు రోజుల్లో తేలిపోయి... జగన్​ కేసులు ఏళ్లపాటు సాగాలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.