ETV Bharat / city

సామాజిక వేత్త పద్మశ్రీ గుత్తా మునిరత్నం మృతి.. చంద్రబాబు సంతాపం

ప్రముఖ సామాజిక వేత్త, పద్మశ్రీ గుత్తా మునిరత్నం కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

పద్మశ్రీ గుత్తా మునిరత్నం
సామాజిక వేత్త పద్మశ్రీ గుత్తా మునిరత్నం మృతి
author img

By

Published : May 6, 2021, 7:59 PM IST

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, రాష్ట్రీయ సేవాసమితి స్థాపకుడు పద్మశ్రీ గుత్తా మునిరత్నం (85) కన్నుమూశారు. కరోనా సోకడంతో చెన్నైలో మెరుగైన వైద్యం కోసం వెళ్లిన ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మునిరత్నం మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందరో అనాథలను ఆదుకోవటంతో పాటు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయటంతో పాటు లక్షలాది నిరుద్యోగులకు స్వయం ఉపాథి శిక్షణకు చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఎన్నో విలువలున్న ఆదర్శవంతుడని కోల్పోయామని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

మునిరత్నం ప్రస్థానం..

తిరుపతిలో రాష్ట్రీయ సేవాసమితి పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించిన మునిరత్నం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2500 వెనుకబడిన గ్రామాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1936 జనవరి 6 న అవిభక్త ఆంధ్రప్రదేశ్​లోని తిరువళ్లూరు జిల్లా సీతాపురంలో జన్మించారు. ఎన్జీరంగా, నిర్మలా దేశ్ పాండే స్ఫూర్తితో గాంధేయ మార్గంలో నడిచారు.

చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ దురంధరుడు పాతూరి రాజగోపాల నాయుడుతో కలిసి 1981 లో రాయలసీమ సేవా సమితిని స్థాపించారు. అనంతరం రాష్ట్రీయ సేవా సమితిగా పేరు మార్చి సామాజిక సేవారంగంలో అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందారు. గ్రామీణ మహిళల అభ్యున్నతి, ఉపాధి కల్పన, చిన్నారుల సంరక్షణ, విద్యను అందిచడాన్ని ధ్యేయంగా ఆయన స్థాపించిన 'రాస్' ద్వారా కృషి చేశారు. తన సేవలతో మునిరత్నం ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆయన అందించిన సేవలకుగానూ సామాజిక సేవా విభాగంలో 2012 లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మునిరత్నం మృతి పట్ల అనేక మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

34 మంది మంత్రులతో కలిసి స్టాలిన్ ప్రమాణం!

రాష్ట్రంలోని దయనీయ పరిస్థితులకు ఆ ఘటనే నిదర్శనం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.