Share of tax increased: కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెరిగింది. అన్ని రాష్ట్రాలకూ కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,65,563 కోట్ల వాటా వెళ్తుందని ఆర్థికశాఖ బడ్జెట్‌లో అంచనా వేయగా.. అంచనాల సవరణ నాటికి అది రూ.7,44,743 కోట్లకు (11.89%) పెరిగింది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రాలకు రూ.8,82,904 కోట్లు విడుదలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం పేర్కొంది. ఇది బడ్జెట్ అంచనాల కంటే 32.65%, సవరించిన అంచనాల కంటే 18.55% అధికం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నుల నుంచి రూ.35,386 కోట్లు దక్కింది. ఇది బడ్జెట్ అంచనాల కంటే 31.3%, సవరించిన అంచనాల కంటే 16.57% ఎక్కువ. తెలంగాణకు రూ.18,721 కోట్లు వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాలకంటే 33.81%, సవరించిన అంచనాలకంటే 17.54% అధికం.
ఇదీ చదవండి: