ETV Bharat / city

సికింద్రాబాద్ విధ్వంసం.. కొత్త అప్డేట్ ఇదే! - అగ్నిపథ్ తాజా వార్తలు

Secunderabad riots case update: అగ్నిపథ్‌ ప్రకటనకు నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జూన్‌ 17న జరిగిన విధ్వంసం కేసులో.. తాజాగా మరో అప్డేట్ వెలుగు చూసింది. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

Secunderabad riots case update
ఆవుల సుబ్బారావు అరెస్టు ఆలస్యమేనా
author img

By

Published : Jun 25, 2022, 8:52 AM IST

Secunderabad riots case update: అగ్నిపథ్‌ ప్రకటనకు నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జూన్‌ 17న జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారిగా వ్యవహరించిన ఆవుల సుబ్బారావు అరెస్టుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసులో ఏడుగురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఏడుగురూ సుబ్బారావు అనుచరులేనని రైల్వే పోలీసులు ఆధారాలు సేకరించారు.

అంతకుముందు సుబ్బారావుతో సహా ఎనిమిది మందిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే పోలీస్​స్టేషన్​కు తరలించారు. తాజాగా ఆదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారించిన తర్వాత సుబ్బారావును న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సుబ్బారావు నేరం చేశాడన్న ఆధారాల్లేవు.. న్యాయవాది: సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు ప్రత్యక్షంగా పాల్గొన్నాడనే ఆధారాల్లేవని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలనే ఆయన ఆర్మీ అభ్యర్థులకు సూచించాడని తెలిపారు. 17వతేదీ సుబ్బారావు సికింద్రాబాద్‌లో లేడని, బోడుప్పల్‌లోని సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఉన్నాడని చెప్పారు. సుబ్బారావు నేరానికి పాల్పడినట్టు ఆధారాలు లేకపోవడం వల్లనే పోలీసులు ఇన్ని రోజులు అదుపులో ఉంచుకున్నారన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.