గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్ రూపొందించి.. వారికి ఉద్యోగపరమైన ప్రయోజనాలు అందజేయాల్సిన అవసరం ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అభిప్రాయపడ్డారు. విజయవాడ కమిషనరేట్లో నిర్వహించిన సమావేశంలో సిబ్బందికి సర్వీసు రూల్, సెలవు నియమావళి, ప్రొబేషన్, ఉద్యోగుల ఆరోగ్య పథకం, కారుణ్య నియామకాలు, సర్వీసు పుస్తకం నిర్వహణ, శిక్షణలు, శిక్షణ సంబంధిత పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు, డ్రెస్ కోడ్ తదితర అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు.
మార్చి 30 లోగా ఆయా శాఖలు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సర్వీసు పుస్తకాలు ప్రారంభించాలని సూచించారు. శాఖాపరమైన శిక్షణలతో పాటు, సర్వీసు నియమావళి, ప్రవర్తనా నియమావళి, సీసీఏ నియమావళి, సెలవు నియమావళి, కంప్యూటర్ పరిజ్ఞానం వంటి అంశాలలో శిక్షణ పొందాలన్నారు. శాఖాపరమైన పరీక్షలు, శిక్షణాపరమైన పరీక్షలు ప్రొబేషన్ ప్రకటనకు ముందుగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: