రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు భద్రత పెంచారు. తనకు భద్రత పెంచాలన్న ఎస్ఈసీ వినతి మేరకు పోలీసు శాఖ ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఒక ఏఎస్ఐ, నలుగురు సిబ్బందితో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా ఎస్కార్టు వాహనాన్ని కేటాయించారు. ఎస్ఈసీకి ఇప్పటి వరకు ఉన్న వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా కార్యాలయంలోనూ భద్రతను పెంచారు.
ఇదీచదవండి: సిబ్బందిని కేటాయించండి.. కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ