గవర్నర్ బిశ్వభూషణ్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరుని గవర్నర్‌కు వివరించారు. నాలుగు దశల ఎన్నికల్లో జరిగిన ఘటనలు సహా పోలింగ్ సరళి ,అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు ,వెల్లడైన ఫలితాలను ప్రత్యేకంగా నివేదిక రూపంలో గవర్నర్‌కు అందించినట్లు సమాచారం.
అనంతరం మార్చి 10న జరపనున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించిన స్థానాల్లో అభ్యర్థుల నుంచి తిరిగి నామినేషన్లు తీసుకునేందుకు తీసుకుంటోన్న చర్యలను రమేశ్ కుమార్ వివరించినట్లు తెలిసింది.
12 కార్పోరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో మార్చి 10న పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణ అంశం కూడా భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. న్యాయ స్థానాల్లో కేసు వల్ల ఎదురవుతోన్న అవరోధాలను గవర్నర్‌తో చర్చించారని.. అవరోధాలు వీడగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు గవర్నర్ దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం.
అరగంట పాటు జరిగిన సమావేశంలో పంచాయతీ ఎన్నికలు సమర్థంగా, ప్రశాంతంగా జరిపినందుకు ఎస్ఈసీని గవర్నర్ బిశ్వభూషణ్ అభినందించినట్లు తెలిసింది. రానున్న పురపాలక ఎన్నికల్లోనూ ప్రభుత్వం, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఎన్నికల కమిషన్‌కు నిర్దేశించినట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి
ఎస్ఈసీ పిటిషన్‌పై విచారణ.. హాజరుకావాలని నీలం సాహ్ని, ద్వివేదికి హైకోర్టు ఆదేశం