మున్నిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఓటర్లను ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేయండ వంటివాటిని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు.
అన్ని మున్సిపాలిటీల్లోని నిర్దిష్ట ప్రాంతాల్లో ఆయా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు ఎస్ఈసీ వివరించారు. గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థలను ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు పర్యవేక్షిస్తారని తెలిపారు.
విశాఖపట్నం జిల్లా సహా, ప్రత్యేకంగా జీవీఎంసీలో ఐజీ సంజయ్, వైజాగ్ సీపీ నిరంతరం ఎన్నికలను పర్యవేక్షిస్తారు. వీరితో పాటు ముగ్గురు ఎస్పీలు, ముగ్గురు సీనియర్ అధికారులను ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల్లో పారదర్శకత తీసుకురావడానికి పూర్తి ఫీల్డ్ ఓరియంటెడ్ నెస్ & పర్యవేక్షణ అమలు చేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నారు.
ఇదీ చూడండి: సాగరమాల కింద ఏపీలో 92 ప్రాజెక్టులు: కేంద్రం