ETV Bharat / city

మూడు రాజధానుల ఏర్పాటు కొన్ని రోజులు ఆలస్యం..నిర్ణయం కాదు: సజ్జల - మూడు రాజధానులపై సజ్జల కామెంట్స్

జనాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని ఆయన వ్యవహారశైలిలో విపరీత ధోరణి కనిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు కొద్ది రోజులు ఆగిందని.. నిర్ణయం మాత్రం ఆగదని స్పష్టం చేశారు.

sajjala ramakrishna reddy comments on chandrababu

author img

By

Published : Mar 8, 2021, 7:33 PM IST

చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. తన పర్యటనల్లో ప్రజలను చంద్రబాబు ఘోరంగా అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ముందు అసభ్యంగా, బూతులు ఉపయోగిస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే అధికారం రాదనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టేంతగా ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని సజ్జల ఆరోపించారు.

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ ఖచ్చితంగా జరుగుతుందన్న సజ్జల.. మూడు రాజధానుల ఏర్పాటులో కొద్ది రోజులు ఆలస్యం తప్ప నిర్ణయం ఆగదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సజ్జల అన్నారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు అమ్మేస్తాం.. రామాయపట్నం పోర్టుకు డబ్బులివ్వలేం: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.