ETV Bharat / city

Letter To KRMB: 'ఆ ప్రాజెక్టులు పూర్తయితే.. 30 లక్షల ఎకరాలు బీళ్లవుతాయి' - తెలంగాణ ప్రాజెక్టులు

తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమనీ.. వాటిని నిలువరించాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు ఏపీ సాగునీటి వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాల కృష్ణ ఈ మెయిల్ ద్వారా లేఖ రాశారు. ఆ ప్రాజెక్టులు పూర్తయితే నాగార్జున సాగర్ దిగువ భాగంలో 30 లక్షల ఎకరాలకు నీరందని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ ప్రాజెక్టులు పూర్తయితే..30 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారతాయి

author img

By

Published : Aug 31, 2021, 7:08 PM IST

శ్రీశైలం ఎగువన కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘం డిమాండ్ చేసింది. ఆ ప్రాజెక్టులు పూర్తయితే నాగార్జున సాగర్ దిగువ భాగంలో 30 లక్షల ఎకరాలకు నీరు అందని పరిస్థితి నెలకొంటుందని సంఘ సభ్యులు ఆరోపించారు. రేపు జరగబోయే కేఆర్​ఎంబీ(KRMB) సమావేశంలో ఏపీ తరఫున ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలన్నారు.

"అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే తెలంగాణ ప్రాజెక్టులను చేపడుతోంది. అవి పూర్తయితే నాగార్జున సాగర్ కింద ఉన్న దాదాపు 30 లక్షల ఎకరాల బీడు భూములుగా మారుతాయి. రేపు జరిగే కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో, కేంద్ర గెజిట్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం సమర్ధ వాదనలు వినిపించాలి. శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు అడ్డుకట్ట వేసి, ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలి." -ఆళ్ళ వెంకట గోపాల కృష్ణ, ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు

ఆ ప్రాజెక్టులు పూర్తయితే..30 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారతాయి

KRMBకి లేఖ

తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు ఏపీ సాగునీటి వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాల కృష్ణ ఈ మెయిల్ ద్వారా లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా 105 టీఎంసీలతో కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులు నిర్మించటం అక్రమమని ఫిర్యాదు చేశారు. 150 టీఎంసీలతో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, భక్తరామదాసు, తుమ్మెల్ల, మిషన్ భగీరథ ప్రాజెక్టులన్ని అనుమతి లేనివేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయం కృష్ణా బేసిన్​కు కీలకంగా ఉన్న విజయవాడలో ఏర్పాటు చేయాలన్నారు.

ఇదీ చదవండి

WEATHER REPORT: రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.