కరోనాతో చనిపోయిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు ఇవ్వడానికి ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ నెలాఖరులోగా అర్హులను ఎంపిక చేసి ఉద్యోగాలివ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసిన వారి వివరాల జాబితాను పంపాలని, అన్ని జిల్లాల రీజనల్ మేనేజర్లను ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలోగా ప్రక్రియను తప్పక పూర్తి చేయాలని ఆదేశాల్లో తెలిపారు. కారుణ్య నియామకాలపై ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఆర్టీసీలోని కార్మిక సంఘం ఎన్ఎంయూ హర్షం వ్యక్తం చేసింది. వీటితో పాటు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాక ముందు మిగిలిపోయిన కారుణ్యానియామకాలు సహా 2020 జనవరి తర్వాత ఇతరత్రా కారణాలతో చనిపోయిన ఉద్యోగుల వారసులకూ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి, ఎండీకి ఎన్ఎంయూ నేతలు విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.