ETV Bharat / city

PTD RTC: 'జీతాలు అధికారులకు తగ్గి... ఉద్యోగులకు పెరిగాయి'

PTD RTC: ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల క్యాడర్ల వారీగా గత, ప్రస్తుత మూలవేతనాల జాబితాను రూపొందించింది. దాన్ని సోమవారం ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీలో 2017లో అమలు చేసిన రివిజన్‌ పే స్కేల్‌ (ఆర్‌పీఎస్‌-17), ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా అమలు చేసిన పీఆర్సీ-2022లో ఎంత తేడా ఉందనేది అందులో చూపారు.

PTD RTC
PTD RTC
author img

By

Published : Jun 7, 2022, 10:37 AM IST

PTD RTC: పీఆర్సీతో తమకు ఒరిగిందేమీలేదని ప్రజా రవాణా శాఖ (పీటీడీ-ఆర్టీసీ) ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో... ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల క్యాడర్ల వారీగా గత, ప్రస్తుత మూలవేతనాల జాబితాను రూపొందించింది. దాన్ని సోమవారం ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీలో 2017లో అమలు చేసిన రివిజన్‌ పే స్కేల్‌ (ఆర్‌పీఎస్‌-17), ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా అమలు చేసిన పీఆర్సీ-2022లో ఎంత తేడా ఉందనేది అందులో చూపారు. దీని ప్రకారం... ఈడీలు, రీజనల్‌ మేనేజర్‌, సీఎంఈ, సీసీఈ, సీపీఎం, సీసీఎస్‌, సీఎంవో, డిప్యూటీ సీఎంఈ, ఈఈ తదితర క్యాడర్ల అధికారులకు గతంతో పోలిస్తే మూలవేతనంలో తగ్గినట్లు చూపారు. అయితే ఈ తగ్గిన మొత్తాన్ని వారికి పర్సనల్‌ పే రూపంలో చెల్లించనున్నారు. మరోవైపు డిపో మేనేజర్‌, డ్రైవర్‌ గ్రేడ్‌-1, కండక్టర్‌ గ్రేడ్‌-1, కంట్రోలర్‌, జూనియర్‌ అసిస్టెంట్లకు పెరిగినట్లు చూపారు.

* పీఆర్సీ-2022 ప్రకారం హెచ్‌ఆర్‌ఏ తగ్గడం, గ్రేడ్‌పే తొలగించడం, పలు అలవెన్సులలో కోతపెట్టడం వంటి వాటి కారణంగా... ఇప్పుడు పెరిగినట్లు చూపినదంతా పరిగణనలోకి తీసుకోలేమని ఉద్యోగులు చెబుతున్నారు. జూన్‌ జీతానికి సంబంధించి పేస్లిప్‌ తయారయ్యాక అసలు ఎంత పెరిగింది, ఎంత నష్టం జరిగిందనేది స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.