కరోనా ప్రభావంతో నష్టపోయిన పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ దాసరి భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మౌన దీక్షకు దిగారు. కరోనాతో నష్టపోయిన రైతులు, కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలని... గిడ్డంగుల్లోని ఆహార ధాన్యాలను పేదలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ఐదు వేలు, రాష్ట్రం ఐదువేలు చొప్పున పేదలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం, 50 కిలోల గోధుమలు పంపిణీ చేయాలన్నారు. రైతులు, చిరు వ్యాపారుల రుణాలు రద్దు చేసి... చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పారు.
ఇదీ చదవండి: