ETV Bharat / city

నిబంధనలు పాటించని ఐస్​క్రీమ్ పరిశ్రమలపై చర్యలు

గత వారం విజయవాడ నగర పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఐస్​క్రీమ్​ పరిశ్రమలపై ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్​ కృతికా శుక్లా పేర్కొన్నారు.

'నిబంధనలు పాటించలేని ఐస్​క్రీమ్ పరిశ్రమలపై కఠిన చర్యలు'
author img

By

Published : May 7, 2019, 12:27 PM IST

'నిబంధనలు పాటించలేని ఐస్​క్రీమ్ పరిశ్రమలపై కఠిన చర్యలు'

విజయవాడ నగర పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఐస్​క్రీమ్ పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. గత వారం ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన సమయంలో పలు కంపెనీల యాజమాన్యాలు అపరిశుభ్ర వాతావారణంలో పరిశ్రమలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి... 3 పరిశ్రమలకు 50 వేల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. మొదటి తప్పుగా 50 వేల రూపాయల జరిమానాతో వదిలేస్తున్నామని...మరోసారి తనిఖీల్లో పట్టుబడితే పరిశ్రమను శాశ్వతంగా మూసివేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోరంకిలోని ఓ ఐస్ క్రీమ్ పరిశ్రమ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించామని... ఆ పరిశ్రమను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని... జరిమానా విధించిన పరిశ్రమల్లో వారం రోజుల్లో మరోసారి తనిఖీలు ఉంటాయని... నిబంధనలు అమలు చేయకపోతే శాశ్వతంగా మూసివేస్తామని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.