ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 1972 నుంచి ఏటా జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే క్షీణించిన, నాశనమైన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి అంతా నడుం బిగించాలని విజ్ఞప్తి తెలిపారు. చెట్లను పెంచడం, నగరాలను పచ్చదనంతో నింపడం, తోటల పునరుద్ధరణ, ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడం.. నదులు, వాటి తీరాలను శుభ్రపరచడం, కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ వాడకపోవడం, పర్యతాలు కొండలను పరిరక్షించుకోవడం వంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని పునరుద్ధరించవచ్చని చెప్పారు.
అడవులు, వ్యవసాయ భూములు, నగరాలు, చిత్తడి నేలలు, మహాసముద్రాలు సహా అన్ని పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించి-వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు.. జీవవైవిద్య పురోభివృద్ధికి పాటుపడతాయని మంత్రి బాలినేని ఆకాంక్షించారు.
ఇదీ చదవండీ... కొవిడ్ తగ్గాక.. పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేశ్