ఈనెల 26న నిర్వహించే గణతంత్ర వేడుకలకు... విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్రివిధ దళాలు నిర్వహించే కవాతు సక్రమంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతంసవాంగ్ సూచించారు. ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో వేడుకలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా తీసుకుంటున్న ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు వివరించారు.
ఇవీ చదవండి: