ETV Bharat / city

గందరగోళంగా ఆర్‌సెట్‌ కౌన్సెలింగ్‌... ఆశావహుల ఆవేదన - ఆర్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో గందరగోళం

విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించిన ఆర్‌సెట్ కౌన్సెలింగ్‌ గందరగోళంగా మారింది. నెట్, స్లెట్‌ తదితర అర్హతలున్న వారికి నిబంధనల ప్రకారం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉన్నత విద్యామండలి అశాస్త్రీయ విధానాలతో ఎక్కువ అర్హతలున్నా సీట్లు లభించక నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు

rcet
rcet
author img

By

Published : May 1, 2022, 6:06 AM IST

విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించిన ఆర్‌సెట్ కౌన్సెలింగ్‌ గందరగోళంగా మారింది. పీజీతో ఆర్‌సెట్‌ రాసిన వారికి 75 శాతం, విశ్వవిద్యాలయం నిధుల సంఘం (యూజీసీ), జాతీయ అర్హత పరీక్ష (నెట్‌), జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌), గేట్‌, స్లెట్‌, టీచర్స్‌ ఫెలోషిప్‌, ఎంఫిల్‌ అభ్యర్థులకు కేవలం 25 శాతం సీట్లను కేటాయించారు. యూజీసీ నిబంధనల ప్రకారం నెట్‌, స్లెట్‌ తదితర అర్హతలున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇక్కడ 25 శాతం సీట్లకే పరిమితం చేశారు. సీట్ల కేటాయింపులో దేశంలో ఎక్కడా లేని విధానాన్ని పాటించిన ఉన్నత విద్యామండలి.. ఎక్కువ అర్హతలున్న తమకు సీట్లు రాకుండా చేసిందని ఆ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌సెట్‌కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో నెట్‌, స్లెట్‌ అర్హతలున్న వారికి 25 శాతం సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. మిగతా 75 శాతం ఎలా భర్తీ చేస్తారో ప్రస్తావించలేదు. కానీ కన్వీనర్‌ మాత్రం 25, 75 శాతం చొప్పున సీట్ల కేటాయింపు పూర్తి చేశారు.

గందరగోళంగా ఆర్‌సెట్‌ కౌన్సెలింగ్‌... ఆశావహుల ఆవేదన

మొదటి 10 ర్యాంకర్లకూ దక్కని ప్రవేశం

ఆర్‌సెట్‌ దరఖాస్తు సమయంలో నెట్‌, స్లెట్‌, ఎంఫిల్‌ తదితర అర్హతలు అడగటంతో అభ్యర్థులు సమాచారం ఇచ్చారు. వీరూ పీజీ పూర్తి చేసినవారే. సీట్లు వచ్చేందుకు అదనపు అర్హతలు ఉపయోగపడతాయని భావించారు. అందుకు విరుద్ధంగా సీట్లలో కోత వేశారు. కేటగిరి-1 కింద వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పీహెచ్‌డీలో ఎడ్యుకేషన్‌ సబ్జెక్టులో 1, 4, 6, 7, 8 ర్యాంకులు సాధించిన వారికి కూడా సీట్లు రాలేదు. ఈ సబ్జెక్టులో మొత్తం సీట్లలో 25 శాతం మాత్రమే ఇవ్వడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేశారు. దీంతో మొదటి 10 ర్యాంకర్లకు కూడా సీట్లు దక్కలేదు. తెలుగు, కామర్స్‌, ఇతర సబ్జెక్టుల్లోనూ కేటగిరి-1 వారికి ఉత్తమ ర్యాంకులు వచ్చినా సీట్లు తక్కువగా ఉన్నందున పొందలేకపోయారు. నెట్‌, స్లెట్ వారికి 25 శాతం సీట్లు, పీజీ అర్హత ఉన్నవారికి 75 శాతం సీట్లు కేటాయిస్తామనే అంశాన్ని దరఖాస్తు సమయంలో చెప్పలేదు. కౌన్సెలింగ్‌ సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఉత్తర్వుల్లో మొదట కేటగిరి-1కి కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఒకవేళ సీట్లు మిగిలిపోతే వాటిని కేటగిరి-2 అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 75 శాతం సీట్ల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే ఆ నిష్పత్తిలో సీట్లు భర్తీ చేయడంతో నష్టపోయామని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.

ఇదీ చదవండి : నాగార్జున వర్సిటీ పూర్వ రిజిస్ట్రార్‌ రోశయ్యకు జైలుశిక్ష, జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.