Ravi Chettu Branch Slightly Broken In Vijayawada Temple : విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఆలయంలోని రావిచెట్టు కొమ్మ పైభాగం స్వల్పంగా విరిగింది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు బయటకొచ్చి కూర్చునే ప్రాంతంలో విరిగిన చెట్టుకొమ్మలు పడ్డాయి. అమ్మవారి దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకొచ్చి ధ్వజస్తంభానికి, రావిచెట్టుకు మొక్కునే అలవాటు భక్తులకు ఉంది. చెట్టుకు నమస్కారాలు చేస్తున్న సమయంలో పెద్దగా శబ్ధం వచ్చి రావిచెట్టు కొమ్మ విరిగిపడడంతో సమీపంలోని భక్తులు దూరంగా పరుగులు తీశారు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఒరిగిన, విరిగిపడిన కొమ్మలను తొలగించారు.
ఇవీ చదవండి: