రేషన్ బియ్యం పంపిణీ ప్రజా ప్రయోజన కార్యక్రమమని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. నేటి నుంచి పట్టణాలు, నగరాల్లో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మెుబైల్ వాహనాల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
నిత్యావసరాల పంపిణీని విస్మరించటం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించిందన్నారు. పేదల ఆకలితీర్చే కార్యక్రమమన్న న్యాయస్థానం వ్యాఖ్యలు హర్షణీయమన్నారు. రాజకీయ నేతలెవరూ లేకుండానే అర్బన్ ప్రాంతాల్లో సోమవారం నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీపై ఎస్‌ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి కొడాలి వెల్లడించారు.
ఇదీచదవండి