రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లతో కనీస సంప్రదింపులు జరపకుండా.. రేషన్ పంపిణీ వ్యవస్థలో (Ration dealers fires on govt) ఇంటింటికీ రేషన్ అంటూ థర్డ్ పార్టీని తీసుకువచ్చిందని రేషన్ డీలర్ల సంఘం నాయకులు ఆరోపించారు. తమ వృత్తి భద్రతపై హామీ ఇవ్వకుండా నిర్ణయం తీసుకుందని అన్నారు.
రేషన్ పంపిణీ విధానంలో ఆహార భద్రతా చట్టాలకు వ్యతిరేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ఇంటింటికీ రేషన్(ration door delivery system) కూడా తామే పంపిణీ చేయగలమని రేషన్ డీలర్ల సంఘం నాయకులు స్పష్టం చేశారు.
తమ సమస్యలపై.. డిసెంబర్ 10న జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహిస్తామని.. డిసెంబర్ 17న ఛలో విజయవాడ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. దేశంలో ఆహార భద్రతా చట్టం ప్రకారం ఏ విధంగా రేషన్ పంపిణీ కొనసాగిస్తున్నారో, రాష్ట్రంలో కూడా అదే విధంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. తమ నిరసనలకు ముందే ప్రభుత్వం స్పందించాలని.. లేదంటే జాతీయ స్థాయిలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
TDP PARLIAMENTARY PARTY MEETING: 'రాష్ట్రంలోని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి'