చౌరస్తా బ్యాండ్ పేరుతో ప్రత్యేక గీతాలను రూపొందిస్తూ ప్రజల్లో ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల అవగాహన కల్పిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో పాటను విడుదల చేశారు.
ఏడు దశాబ్దాలు దాటినా దేశం ఏ పరిస్థితుల్లో ఉందో తన పాట రూపంలో వివరించాడు. నువ్వు నేను ఒకటాటా... మన కీర్తి ఘనమాటా.. నూరు కొట్ల జనమాటా సాగే పాటకు ఆనంద్ గుర్రం సాహిత్యాన్ని సమకూర్చగా.. రామ్ మిర్యాల ఆలపించారు. ఏ దేశమేగినా ఎలుగెత్తి పాడినా నా జెండా వందనమంటూ సాగే పాట ఆద్యంతం దేశభక్తిని రగిలిస్తోంది.