ETV Bharat / city

గోదావరి నదిపై రైల్ కమ్ రోడ్ వంతెన పనులు పూర్తి

author img

By

Published : May 22, 2020, 11:00 PM IST

కొవిడ్ -19 లాక్ డౌన్ సందర్భంగా రైళ్లు రద్దు చేసిన సమయాన్ని... రైల్వే శాఖ సద్వినియోగం చేసుకుంది. గోదావరి నదిపై ప్రఖ్యాతి చెందిన రైల్ కమ్ రోడ్ వంతెన భారీ పునరుద్ధరణ పనులు దక్షిణ మధ్య రైల్వే పూర్తిచేసింది.

గోదావరి నదిపై రైల్ కమ్ రోడ్ వంతెన పనులు పూర్తి
గోదావరి నదిపై రైల్ కమ్ రోడ్ వంతెన పనులు పూర్తి

గోదావరి నదిపై ప్రఖ్యాత రైల్ కమ్ రోడ్ వంతెన భారీ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ పూర్తి చేసింది. దక్షిణ మధ్య రైల్వే లాక్ డౌన్ సమయంలో పలు రైలు మార్గ నిర్వహణ పనులు చేపట్టింది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్వహణ పనులు పూర్తిచేయాలని సంకల్పించి... 36 గంటల్లో పూర్తి చేశారు. 3 కిలోమీటర్ల పొడవుతో 6 స్పాన్లతో, పీయస్ సీ.డెక్ స్లాట్లు కలిగిన స్లీపర్లు గల ఈ వంతెనను దశాబ్దాలుగా వినియోగిస్తున్నారు.

ప్రస్తుతం వంతెనపై విభాగాలను పునరుద్ధరణ కోసం తొలగించి వాటి స్థానంలో సరికొత్త ప్రీ-ఫీట్ స్లీపర్లను బిగించారు. పూర్తిగా ఆటోమేటిక్, యాంత్రిక పద్ధతిలో జరిగిన ఈ పునరుద్ధరణకు పరిమిత సంఖ్యలో పనివారిని ఉపయోగించి అత్యాధునిక పీక్యుఆర్ఎస్ ( ప్లాసర్ క్విక్ రిలేటింగ్ సిస్టమ్) క్రేన్లను ఉపయోగించి సాధ్యమైనంత తక్కువ సమయంలో పూర్తిచేశారు. రైలు రవాణాపై భాగంలోనూ, రహదారి రవాణా కింది భాగంలో సాగే విధంగా నిర్మించిన ఈ అద్భుత వంతెన పునరుద్ధరణలో అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చిందని రైల్వే శాఖ వెల్లడించింది.

ఈ పనులను పూర్తిచేసిన రైల్వే ఇంజినీర్లను, విజయవాడ డివిజన్ డీఆర్ఎం పి.శ్రీనివాస్, వారి బృందం చేసిన కృషిని జీ.ఎం.గజానన్ మాల్యా అభినందించారు. 34 స్పాన్లతో ( 28 స్పాన్ల స్టీల్ గర్డర్, 6 స్పాన్ల పియస్ సిడెక్ స్పాన్లు ) గోదావరిపై ఉన్న ఈ వంతెన భారతదేశంలోని రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిలలో 3వ స్థానంలో నిలిచిందని రైల్వే శాఖ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.