Rahul Gandhi Second Day: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజూ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నిన్న వరంగల్ సభలో పాల్గొన్న తర్వాత రహదారి మార్గంలో హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రికి తాజ్ కృష్ణలో బస చేశారు. నేడు ఉదయం 10 గంటలకు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారితో హోటల్‌లోనే ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య వర్ధంతి సందర్భంగా... సంజీవయ్య పార్క్ సందర్శించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం గాంధీభవన్ చేరుకుంటారు. ఎక్స్‌టెండెడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరుగనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన కో-ఆర్డినేటర్లను రాహుల్ గాంధీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిచయం చేయించి ఫొటోలు తీసుకునే కార్యక్రమం జరుగునుంది. సాయంత్రం గాంధీభవన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళతారు. దాదాపు గంటపాటు ఎయిర్ పోర్టులో ఉంటారు. సాయంత్రం 5గంటల 40నిమిషాలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
ఇవీ చూడండి:
గులాబీ రిమోట్ కమలం చేతిలో.. ఈసారి టిక్కెట్లు వారికే : రాహుల్
'ఆరాధన' మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి ఖాతాలోనే..!